కోనరావుపేట మండలం లో ఇటీవల ఆత్మహత్య చేసుకొని మరణించిన కోనరావుపేట మండలం మల్కపేట గ్రామానికి చెందిన ఆకుల రామదాసు కుటుంబాన్ని శనివారం రోజున ఎంపీపీ చంద్రయ్య గౌడ్ తో కలిసి జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలు అరుణా రాఘవరెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం తరుపున ఆర్థిక సహాయం ఇరవై ఐదు వేల రూపాయల చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు.ఈ సందర్భంగా జెడ్పీ చైర్ పర్సన్ అరుణ రాఘవరెడ్డి మాట్లాడుతూ రామదాసు మల్కపేట్ గ్రామంలో చాలా రోజుల నుండి పంపు ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. వారి మరణం చాలా బాధాకరం అని అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. వారి కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు.అనంతరం ఇటీవల గుండెపోటుతో మరణించిన మండలంలోని మర్తనపేట గ్రామానికి చెందిన పెద్ది రాంబాబు కుటుంబాన్ని పరామర్శించారు.వీరి వెంట సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సంతోష్, తెరాస మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య,సింగిల్ విండో చైర్మెన్ బండ నర్సయ్య, సీనియర్ నాయకులు న్యాలకొండ రాఘవ్ రెడ్డి, సర్పంచులు అరుణా లక్ష్మణ్, వంశీ కృష్ణారావు,ఎమ్మార్వో నరేందర్, ఎంపీడీవో రామకృష్ణ,ఎంపీఓ మిర్జా, తదితరులు పాల్గొన్నారు.
