(కరీంనగర్ సెప్టెంబర్ 17)
తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకునే అవకాశం తెలంగాణ ప్రజలకు వచ్చిందని కొత్త జైపాల్ రెడ్డి అన్నారు….
మైత్రి గ్రూప్స్ అధినేత ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కొత్త జైపాల్ రెడ్డి కరీంనగర్ జిల్లా అలుగునుర్ లో ఈరోజు హైదరాబాద్ నిర్వహిస్తున్న సోనియాగాంధీ విజయభేరీ సభకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.
కాంగ్రెస్ శ్రేణులు కొత్త జైపాల్ రెడ్డి అభిమానులు అనుచరులు సుమారు 50వాహనాలలో సభకు తరలివెళ్తున్న ర్యాలీ నీ జండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10 సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచి సోనియాగాంధీ రాహుల్ గాంధీ లకు బహుమతి ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.