ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 16
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జిల్లా పార్టీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి బూతుల వారిగా తప్పనిసరిగా తెలంగాణ విమోచన దినోత్స వం జరుపుకోవాలని ఆదేశించ డంతో ఆదివారం మంగపేట మండలంలో బిజెపి నాయ కులు యరంగారి వీరన్ కుమార్ ఆధ్వర్యంలో 12 బూత్ కమి టీల అధ్యక్షులతో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జెండా ఎగుర వేసి ఘనంగా నిర్వ హించారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మద్దిని కృష్ణమూర్తి,గిరిజన మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కోరం నరసింహారావు,మండల కార్యదర్శి బొల్లికొండ సాంబ య్య,మండల నాయకులు రావుల జానకిరావు,బూత్ కమిటీ అధ్యక్షులు తాటి నాగరాజు,ప్రవీణు,నల్ల మాసుల నవీన్,లోకేష్, మహేష్,సంగాడి రామ కృష్ణ, హనుమంతరావు, బిక్షపతి,వినయ్,సిద్దు,తిలక్,కార్య కర్తలు పాల్గొన్నారు.