గజ్వేల్ ప్రజ్ఞపూర్ మున్సిపల్ 13 వ వార్డ్ వాసవి నగర్ లో ఆదివారం లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ సౌజన్యంతో సహాయ యూత్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన కౌన్సిలర్ సహనాజ్ సమీర్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ సేవలు అభినందనీయమని సమాజ సేవలో లైన్స్ క్లబ్ సేవలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పర్యావరణ పరిరక్షణలో భాగంగా లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ చేయడం మా 13వ వార్డులో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేయడం సంతోషకరంగా ఉందని సహాయ యూత్ ఆధ్వర్యంలో వాసవి నగర్ లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ నవరాత్రి వేడుకల్లో పాల్గొని దేవదేవుని కృపకు పాత్రులు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఆ స్నేహ అధ్యక్షులు నేతి శ్రీనివాస్, దొంతుల సత్యనారాయణ, పురోహితులు శ్యామ్ పంతులు, వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
