నాడు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించింది ఎర్రజెండా, కమ్యూనిస్టులేనని, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను, మండల కార్యదర్శి కందుకూరి కోటేష్ లు. తెలిపారు. నిడమనూరు మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం, రజాకార్లకు, భూస్వామ్య పెత్తందారులకు వ్యతిరేకంగా సాగిన విరోచిత పోరాటంలో 4000 మంది అమరులు బలిదానం అయ్యారని, 10 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేయబడిందని, వేలాది గ్రామాలు విముక్తి చెంది గ్రామ రాజ్యాలు ఏర్పడ్డాయని వారన్నారు. నాటి పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, వారన్నారు. నేటి పాలకులు తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరించి, చరిత్రను తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నారని, సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర కీలకమని అన్నారు. అమరవీరుల పోరాట స్ఫూర్తితో కష్టజీవులకు పేదలకు, వెన్నంటి ఉండి ప్రతి ఒక్కరికి కూడు,గూడు,గుడ్డ, విద్య వైద్యం అందించేందుకు సిపిఎం నిరంతరం పోరాడుతుందని వారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వారన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు కత్తి లింగారెడ్డి, మండల కమిటీ సభ్యులు కోమాండ్ల గురువయ్య, నల్లబోతు సోమయ్య, మలికంటి చంద్రశేఖర్,కుంచెం శేఖర్, వింజమూరు శివ, మెరుగు రాములు, ముత్యాల కేశవులు, తోటపల్లి బాల నారాయణ, వింజమూరు పుల్లయ్య, విష్ణు, వెంకటమ్మ, సైదమ్మ,, ముట్టిని చంద్రశేఖర్, వేముల ఆంజనేయులు, శ్రీను, బొజ్జ రాములు, రొంపి కాశి, మైసయ్య తదితరులు పాల్గొన్నారు.
