జిల్లా కలెక్టర్ కలిసిన జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ బాబు
ములుగు జిల్లా,సెప్టెంబర్ 16
ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి తో కలిసి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందిం చారు.ములుగు జిల్లాను ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రేమతో నాడు ప్రకటించి నేటి వరకు అభివృద్ధి చేస్తున్నారని అభివృద్ధి లక్ష్యం గా అధికారులు ప్రజా ప్రతిని ధులు పరస్పర సహకారంతో ముందుకు సాగలని జిల్లా అభివృద్ధి పైన చర్చించారు.
వీరి వెంట జడ్పీటీసీ తుమ్మల హరిబాబు,గై రుద్రమదేవి అశోక్,కో ఆప్షన్ జిల్లా వాలియబి,ఎంపీపీ సుడి శ్రీనివాస్ రెడ్డి,అంతటి విజయ నాగరాజు,ముసరగని వినయ్ కుమార్,ఉన్నారు.