ప్రాంతీయం

విజయభేరి మహా..సభ అంటే ఏందో తెలుసా…

275 Views

ముస్తాబాద్, సెప్టెంబర్15, మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏఎన్ఆర్ గార్డెన్ లో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 17ఆదివారంన రాజీవ్ గాంధీ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన విజయ భేరి సభను విజయవంతం చేయవలసిందిగా మండల ప్రజలను కోరారు. తెలంగాణ తల్లిగా పిలుచుకునే సోనియమ్మ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీతో సహా పలు రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రి అతిథులుగా సభకు హాజరవుతున్నారు ఈసభను అడ్డుకోవడానికి బిజెపి బీఆర్ఎస్ పార్టీలు ఎన్నో కుట్రలు పన్నాయి అన్నారు. ఆఖరికి భూమికూడా ఇవ్వని పరిస్థితుల్లో అక్కడి రైతులు స్వచ్ఛందంగా మాభూమి తీసుకోండి అని అనడం కాంగ్రెస్ పార్టీ విజయానికి తొలి మెట్టు అన్నారు. అలాగే ఆసభలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత అమలు చేయబోయే ఐదు గ్యారెంటీ పథకాలను తెలంగాణ ప్రదాత తల్లి సోనియా గాంధీ మాటల్లో తెలంగాణ సమాజం వినబడుతుంది అన్నారు. మండలంలోని ప్రజలు రైతులు నిరుద్యోగులు కార్మికులు యువకులు అధిక మొత్తంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాంమని వివరించారు. అలాగే ఈరోజు సిరిసిల్ల బిఆర్ఎస్ పార్టీ తలపెట్టిన కృతజ్ఞత సభ వారి అవివేకానికి నిదర్శనం అన్నారు. జిల్లాలో ఓవైపు అభ్యర్థులు టెట్ పరీక్ష రాస్తున్న వారికి సౌండ్ పొల్యూషన్ ద్వారా ఇబ్బందులు తలెత్తుతాయని పలువురి ఆరోపణలు ఉన్నాయని అన్నారు. సభకు అనుమతి ఎలా ఇచ్చారు అర్థం కావడం లేదు అన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మిర్యాలకార్ శ్రీనివాస్, ఎంపిటిసిలు గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, దుబ్బాక స్వేచ్ఛ రాజు, మండల ఎస్సీ సెల్ బీసీ సెల్ అధ్యక్షులు తలారి నర్సింలు, శీలప్రశాంత్, చికోడు నామాపూర్ గ్రామశాఖ అధ్యక్షులు కొప్పు రమేష్, గన్నేబానురెడ్డి, ప్యాక్స్ డైరెక్టర్ కరెడ్ల కొండల్ రెడ్డి, వెలుముల రామిరెడ్డి, ఆరుట్ల మహేష్ రెడ్డి, ఉచ్చిడి బాల్ రెడ్డి, రంజాన్ నరేష్, దీకొండ దశరథం, కొమురయ్య,, ఎదునూరి భానుచందర్, మిడిదొడ్డి భాను, మామిండ్ల ఆంజనేయులు, మెరుగు శివగౌడ్, పోతారం వంశి గౌడ్, నవీన్ కుమార్, కళ్యాణ్, మారుతి సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *