విద్యార్థులు చదువుతో పాటు నైపుణ్యాన్ని కలిగి ఉండాలి
నైపుణ్యం కలిగి ఉన్నప్పుడే ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థల ఉద్యోగ అవకాశాలు వస్తాయి రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే రాష్ట్రానికి వేలాది పరిశ్రమలు వచ్చాయి, ఐటీ రంగాన్ని కేవలం హైదరాబాదుకి పరిమితం కాకుండా జిల్లా కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ శాఖల్లో 1,20,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించడం జరిగింది, ప్రైవేటు రంగ సంస్థల్లో 15 లక్షల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత రాష్ట్ర పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ది
నేను ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరా ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరితేనే క్రమశిక్షణ పనిపట్ల అంకితభావం కలుగుతుందని మా నాన్న చేసిన విజ్ఞప్తి మేరకు నేను మా నాన్న ఎమ్మెల్యే అయినప్పటికీ మొదట నేను నాలుగువేల ఉద్యోగానికి ప్రైవేట్ కంపెనీలో చేరా జాబ్ మేళాలో మాట్లాడుతూ తండ్రిని తలుచుకొని భావోద్వేగానికి గురై కంటతడి పెట్టిన ఎమ్మెల్యే నోముల భగత్ నేను ఈరోజు ఇంత క్రమశిక్షణగా మీ ముందు ఈ స్థాయిలో ఎమ్మెల్యేగా నిలబడడానికి మా నానే కారణం గత ఏడాది ఇదే చోట మెగా జాబ్ మేళ నిర్వహించి 890 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది ఈ ప్రాంతంలో చదువుకున్న యువతీ, యువకులకు ఎప్పుడు నేను అండగా ఉంటా, ప్రతి ఏటా జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తా చదువుకున్న యువతీ, యువకులు ఈ ప్రాంతంలో కానీ రాష్ట్రంలో కాని జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రభుత్వానికి అండగా నిలబడండి బీఆర్ఎస్ పార్టీతోనే నాగార్జునసాగర్ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది
ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు,మార్కెట్ కమిటీ చైర్మన్ జవ్వాజి వెంకటేశ్వర్లు,హాలియా మండల పార్టీ అధ్యక్షులు కురాకుల వెంకటేశ్వర్లు, పిడిగం నాగయ్య, తాటి సత్యపాల్, జాటావత్ రవి నాయక్, పట్టణ అధ్యక్షులు చెరుపల్లి ముత్యాలు,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మెరుగు రామలింగయ్య, వార్డు కౌన్సిలర్లు నల్లబోతు వెంకటయ్య, ప్రసాద్ నాయక్,ఎంపీటీసీ ఊర్లకొండ వెంకటయ్య, నిడమనూర్ ఎంపీపీ సలహాదారుడు బొల్లం రవి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సురబి రాంబాబు, పొందిల్ల శ్రీనివాస్,మహిళా అధ్యక్షురాలు జంగాల లక్ష్మమ్మ, ఆప్షన్ నెంబర్లు డోనమిక్, షేక్ సలీం, అన్వర్,సర్పంచులు ,ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోటుగంటి తిరుమల్,పగడాల సైదులు,9వ ఇంచార్జ్ మాతంగి కాశయ్య, జింకల ప్రసాద్ ,మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, విద్యార్థినీలు పాల్గొన్నారు..




