గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యకర్తలకు ఏదైనా ఆపద వస్తే ఆదుకునే నాయకుడే లేకుండా పోయాడు అని దిక్కు తోచని స్థితిలో గజ్వేల్ ప్రజ్ఞపూర్ బిఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసిన గజ్వేల్ ప్రజ్ఞపూర్ మున్సిపల్ బిఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యదర్శి మహమ్మద్ షరీఫ్ బుదవారం వారు మాట్లాడుతూ అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు బిఆర్ఎస్ కార్యకర్తల దుస్థితి ఉన్నదని గజ్వేల్ లో ఎమ్మెల్సీ స్థాయి నుంచి మొదలు పెడితే చైర్మన్ స్థాయి నాయకులు ఉండి కూడా కార్యకర్తలు ఏ నాయకుల దగ్గరికి వెళ్లాలి అని తెలియని అయోమయ పరిస్థితులు ఉన్నాయి ఒక నాయకుడి దగ్గరికి వెళ్తే ఇంకో నాయకుడికి కోపం, మంత్రి హరీష్ రావు దగ్గరికి వెళ్తే గజ్వేల్ లో ఉన్న గడ (గజ్వేల్ డెవలప్మెంట్ ప్రత్యేక అధికారి)దగ్గరికి వెళ్లాలని సూచిస్తాడు అక్కడికి వెళితే గజ్వేల్ లో ఉన్న పెద్ద నాయకులతో ఫోన్ చేయించమని చెబుతారు ఇలా చెప్పుకుంటూ పోతే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బిఆర్ఎస్ కార్యకర్త పరిస్థితి చాలా దారుణంగా ఉంది ప్రభుత్వం రెండోసారి ఏర్పడి కూడా సుమారు నాలుగున్నర సంవత్సరాలు కావస్తున్న ఏనాడు కార్యకర్తల మీటింగ్ పెట్టలేదు కార్యకర్తల స్థితిగతుల గురించి అడగలేదు ఏ కార్యకర్తకు ప్రభుత్వ అభివృద్ధి పథకాల్లో భాగస్వామ్యం చేయలేదు నామినేట్ మరియు పార్టీ పదవుల్లో కూడా కష్టపడ్డ కార్యకర్తలకు అన్యాయం జరిగింది పదవుల పంపకానికి వచ్చేసరికి ఈ నలుగురు పెద్ద నాయకులు కూర్చొని ఏ కార్యకర్తను సంప్రదించకుండా వారి అభిప్రాయం అడగకుండానే వాళ్లకు నచ్చిన వారికి పదవులు రాస్తూ పోతున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే కార్యకర్తల కష్టాలు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడున్న నాయకులు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యకర్తలని కార్యకర్తలుగా కాకుండా ఒక బానిసల్లాగా చూస్తున్నారు …. ఇప్పటికైనా అధిష్టానం మున్సిపల్ పై దృష్టి సారించగలరని కార్యకర్తలకు న్యాయం జరిగేలా చూడాలని ఒక కార్యకర్తగా నేను కోరుకుంటున్నాను అని అన్నారు .ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ గజ్వేల్ ప్రజ్ఞపూర్ అధ్యక్షులు కూరాకుల వెంకట సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.




