మంచిర్యాల జిల్లా కలెక్టర్ ను సన్మానించిన డీఎంహెచ్వో సిబ్బంది.
మంచిర్యాల జిల్లా.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత మరియు వైద్యులు వైద్య సిబ్బంది జిల్లా కలెక్టర్ ని సన్మానించడం జరిగినది జిల్లా కలెక్టర్ కి కేంద్ర ప్రభుత్వము జాతీయ వాటర్ అవార్డ్స్ ను అందించడంలో భాగంగా మంచిర్యాల జిల్లాలో మారుమూల ప్రజలకు అందించడంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్నందున జిల్లా కలెక్టర్ కి అవార్డు రావడం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తరఫున అభినందనలు తెలియజేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ ఆర్డిఓ, డాక్టర్ సుధాకర్ నాయక్ ఉపజిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.





