సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 16 (TS24/7 తెలుగు న్యూస్): సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం ఎమ్మార్వో శ్రావణ్ కుమార్ ను శనివారం ఎమ్మార్వో కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపిన సారథి ఫౌండేషన్ చైర్మన్ గుడాల శేఖర్ గుప్తా ఈ సందర్భంగా శేఖర్ గుప్తా మాట్లాడుతూ జగదేవపూర్ ఎమ్మార్వో గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శ్రావణ్ కుమార్ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ రెవిన్యూ పరంగా విశేష సేవలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్న శ్రావణ్ కుమార్ ప్రజల అభిమానం ఆదరణ పొందుతూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలకాలం సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అనాజిపూర్ గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు హరికృష్ణ గౌడ్, మందాపూర్ ముదిరాజ్ యువజన అధ్యక్షులు అనిల్, సాయిలు తదితరులు పాల్గొన్నారు