ప్రాంతీయం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జర్నలిస్టులసంబరాలు

109 Views

తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర కార్యాలయానికి తెలంగాణ జర్నలిస్టు భవన్ కు హైదరాబాద్లోని స్థలం కేటాయిస్తూ బుధవారం

ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో, ఆర్యవైశ్య భవన్ లో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. సిరిసిల్ల పట్టణంలోని నేతన్న, చౌక వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రమంత్రి కేటీఆర్, రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సలహాదారు
ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
మారుతి సాగర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా
తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ అధ్యక్షులు రాచర్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో రెండు దశాబ్దాలకు పైగా కీలక భూమిక పోషించిన తెలంగాణ జర్నలిస్టు ఫోరం,
తెలంగాణ యూనియన్అఫ్ వర్కింగ్ జర్నలిస్టు కార్యాలయానికి హైదరాబాద్లో స్థలం కేటాయించడం జర్నలిస్టులకు శుభదినం అన్నారు.స్థలం
కేటాయించేందుకు గాను కారణమైన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు కృషిచేసిన మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ,
ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్,,
ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్,
రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ హాజరే లకు రాజన్న చర్చిల జిల్లా కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనియన్ వర్కింగ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు
రాచర్ల లక్ష్మీనారాయణ,
ప్రధాన కార్యదర్శి తీగల మల్లికార్జున్,
,సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు బుస్స
రామనాథం, జిల్లా కోశాధికారి ఎనగందుల శ్రీనివాస్, జర్నలిస్టులు గాదన్నవేని మధు, మామిడి శెట్టి దినేష్, వడ్లూరి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *