దౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో కుటుంబ పోషణ భారమై ఆత్మహత్య చేసుకున్న సూర లక్ష్మి కుటుంబానికి శుక్రవారం చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్ కుటుంబాన్ని పరామర్శించి రూ, ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మల్లయ్య, ఆంజనేయులు గౌడ్, శ్రీనివాస్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు…..




