తొగుట:
ములుగు లోని ఆర్వీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురిని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, చందాపూర్ సర్పంచ్ బొడ్డు నర్సింలు లు పరామర్శించారు. వేంకట్రావుపేట కు చెందిన కల్లెపు సుగుణమ్మ, చందాపూర్ కు చెందిన తుప్పతి మల్లమ్మలకు ఆసుపత్రిలో శాస్త్ర చికిత్స చేయడం జరిగింది. వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడం జరిగింది. వైద్యులతో మాట్లాడటం జరిగింది. ఆర్వీఎం ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్ మంచినీళ్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.




