గంభీరావుపేటకు మరో అవార్డు సొంతం
గంభీరావుపేట మండలం సెప్టెంబర్ 16 తెలుగు న్యూస్ 24/7
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట కేంద్రంలో జరిగిన స్వచ్ఛ సంరక్షణ గ్రామీణ 2023 అవార్డును గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ సంయుక్త పరిపాలన అధికారి చేతుల మీదగా పురస్కారాన్ని మరియు ప్రశంసా పత్రం అవార్డు షీల్డ్ ను అందుకోవడం జరిగింది.
జిల్లాలోని 5 వేలకు పైబడిన జనాభా కలిగిన గ్రామ పంచాయితీల విభాగంలో అవార్డు రావడం జరిగింది..
గ్రామాన్ని పారిశుద్ధ్యం.. పచ్చదనం మరియు లాంటి రెండు అంశాలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నందుకు ఈ అవార్డు నామినేట్ కావడం జరిగింది..
బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామంగా నిర్ధారణ కావడం జరిగింది.
గంభీరావుపేటకు జిల్లాస్థాయిలో అవార్డు రావడం ఇది మూడోసారి కావడం విశేషం
ఈ అవార్డు రావడానికి కారణమైన గ్రామ ప్రజల సహకారానికి కటకం శ్రీధర్ పంతులు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.




