ఘనంగా శ్రీ రంగనాయకుల స్వామి వారి రధోత్సవం.
జగదేవపూర్ ఏప్రిల్ 19
జగదేవపూర్ మండల కేంద్రములోని శ్రీ రంగనాయకుల స్వామి వారి రధోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
రథోత్సవంలో మండల టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాచారం కనకయ్య పాల్గొన్నారు
ఈ సందర్భంగా దాచారం కనిక మాట్లాడుతూ రంగనాయకుల స్వామి ఆశీస్సులతో మండల ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు.అనంతరం దేవాలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి రఘు పంతులు,మారుతి వెంకట్ నరసింహా రెడ్డి, మన్నే ప్రకాష్,రవి మన్నే వారి కుటుంబ సభ్యులు,నాయకులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.





