ప్రాంతీయం

ఇళ్ళు కూలిపోయిన లబ్దిదారులకు తక్షణ సహాయం పంపిణీ

97 Views

ఎల్లారెడ్డిపేట జూలై 15 : ఇటీవల కురిసిన వర్షాలకు ఇళ్ళు కూలీపోయి నష్టపోయిన బాదితులకు తెలంగాణ రాష్ట్ర గౌరవముఖ్యమంత్రి కెసిఆర్ తక్షణ సహాయం కింద ఓక్కోక్కరికి 3200 రూపాయల చొప్పున మంజూరు చేశారని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అద్యక్షులు తోట ఆగయ్య తెలిపారు , ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఇళ్ళు కూలిపోయి నష్టపోయిన 10 మంది లబ్దిదారులకు . 3200 రూపాయల చొప్పున నగదును టిఆర్ఎస్ పార్టీ జిల్లా అద్యక్షులు తోట ఆగయ్య , జడ్పీటీసీ సభ్యులు చీటీ లక్ష్మన్ రావు , తహశీల్దార్ జయంత్ లతో కలిసి శుక్రవారం పంపిణీ చేశారు , ఈ సందర్భంగా జిల్లా అద్యక్షులు తోట ఆగయ్య మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ , రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ లు అదికారులతో సమీక్షించి ఇళ్ళు కూలీపోయి నష్టపోయిన వారికి తక్షణ సహాయం అందించాలనే సదుద్దేశంతో ఒక్కోక్కరికి 3200 రూపాయల చోప్పున పంపిణీ చేయాలని ఆదేశాలు జారీచేశారన్నారు, వారి ఆదేశాల మేరకు రెవెన్యూ అదికారులు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఇళ్ళను పరీశీలించి పది మంది కి తక్షణ సహాయం అందజేయడం జరిగిందన్నారు , అనంతరం ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం జరిగిన సమీక్ష సమావేశంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఇళ్ళు కూలిపోయిన బాధితుల వివరాలు సేకరించి వారికి తక్షణ సహాయం అందజేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారని వారి ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట మండలంలో ఇల్లు కూలిపోయిన 63 మంది బాధితులను గుర్తించి ఒక్కొక్కరికి 3200 చొప్పున తక్షణ సాయం మంజూరు చేశారని ఆయన చెప్పారు పూర్తిగా ఇల్లు కూలిపోయిన నష్టపోయిన వారికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో మాట్లాడి డబల్ బెడ్రూంలు మంజూరు చేయిస్తానని లక్ష్మణరావు తెలిపారు , ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి , ఉపసర్పంచ్ ఓగ్గు రజిత బాలరాజ్ యాదవ్ , ఎంపిటిసి పందిళ్ళ నాగరాణి ,గ్రామ కార్యదర్శి ప్రవీణ్ టిఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి , టిఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు ఎడ్ల లక్ష్మణ్ ,వార్డు సభ్యులు పందిర్ల శ్రీ నివాస్ గౌడ్ , టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎలగందుల నరసింహులు ,పందిర్ల పరుశురాములు గౌడ్ , మీసం రాజం ,మెగినర్సయ్య, బురుక శ్రీ నివాస్ , నేవూరి వెంకట నరసింహారెడ్డి , వీఆర్వో శ్రీనివాస్ , రెవెన్యూ సిబ్బంది ఇండ్లు కూలిపోయిన బాధితులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7