ప్రాంతీయం

ఏసీబీ వలలో అవినీతి చేప…

529 Views
     ముస్తాబాద్, ప్రతినిధి ఆగస్టు 17, ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం ఇవ్వానిదే ఏ పని కాదని,టేబుల్ క్రింద చేతు పెట్టందే టేబుల్ పై , ఏ ఫైల్ కదలదని నిరూపించాడు ఓ పంచాయితీ కార్యదర్శి. ఓ వ్యక్తి సొంత ఇల్లు నిర్మించుకునేందుకు ప్లానింగ్ అనుమతి కోసం 30 వేల రూపాయలు డిమాండ్ చేశాడు ఆ పంచాయితీ కార్యదర్శి.రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండల కేంద్రంలోని సుద్దాల గ్రామంలో గురువారం ఏసీబీ వలలో పంచాయితీ కార్యదర్శి 20 ,000 రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డడు.బండారి యోహెల్  ,తన తండ్రి పేరు మీద ఉన్న స్థలంలో, స్వంత ఇల్లు నిర్మించుకోవడనికి హౌస్ పరిమిషన్ కోసం గత 4 నెలలుగా గ్రామ అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయి, చివరికి పంచాయితీ కార్యదర్శి జగదీష్ దగ్గరికి వెళ్ళగా, నాల చార్జెస్ తో కలిపి పరిమిషన్ కోసం అతడు 30,000 వేల రూపాయలు డిమాండ్ చేశాడు. చేసేది ఏమీ లేక బాధితుడు యెహెల్ సరే అని ఒప్పందం కుదుర్చుకొని.14/08/23 10,000 అడ్వాన్స్ గా ఇచ్చాడు.గురువారం కార్యదర్శి జగదీశ్ మళ్ళీ 20,000 రూపాయలు యోహెల్ వద్ద తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ కార్యదర్శి.ఆ పంచాయితీ కార్యదర్శి  ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకొని 3 గంటలు విచారించగా నల పర్మిషన్ చార్జెస్ 3000,రూపాయలు,మరియు 27000 రూపాయల లంచం తో  కలిపి మొత్తం 30000 రూపాయలు తీసుకున్నట్లు విచారణలో తేలింది అని, ఇంకా ఇందులో ఎవరి హస్తం ఐనా ఉంద అనే కోణంలో విచారణ జరుపుతామని. ఈ పంచాయితీ కార్యదర్శి జగదీష్ పై కేసు నమోదు ,చేసి కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *