నకిలీ విలేకర్లపై చర్యలు తీసుకోవాలి.
డీజేఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొల శ్రీనివాస్.
లక్షెట్టిపేట: పట్టణంలో నకిలీ విలేకరులుగా చలామణి అవుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డీజేఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ తానాజీ నాయక్ కు డిజేఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులతో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీజేఎఫ్ నాయకులు మాట్లాడుతూ… శనివారం పట్టణంలోని బాలాజీ స్వీట్ హౌస్ లో నలుగురు వ్యక్తులు స్వీట్ హౌస్ యజమానిని విలేకరులమంటూ బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్నారు. షాప్ యజమానిని పదివేల రూపాయలు షాప్ యజమాని డిమాండ్ చేయడం ఇది సరైన చర్య కాదన్నారు. ఎవరైనా విలేకరులమంటూ బెదిరింపులకు పాల్పడితే వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని వ్యాపారస్తులను కోరారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డీజేఎఫ్ తరఫున కోరుచున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కుచనపెళ్లి సతీష్, డీజేఎఫ్ మండల ప్రెసిడెంట్ రాంపల్లి మదుచారి, ప్రధాన కార్యదర్శి బైరం లింగన్న, నాయకులు మేడి భాను, ఎనుమల తిరుపతి, కట్ల శంకర్, తిరుపతి, రమేష్, సందీప్, శివ, శేఖర్, రాజు, శంకర్, తదితరులు పాల్గొన్నారు.
