Breaking News

తపాలా శాఖ సేవలపై అవగాహనా సదస్సు

187 Views

ములుగు జిల్లా,గోవిందరా వుపేట,సెప్టెంబర్ 15

 

గోవిందరావుపేట మండలం పసర తపాలా కార్యాలయం లో తపాలా సేవలపై అవగా హన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంకు ముఖ్య అతి థిగా మండల ఎంపీపీ సూడి శ్రీని వాస్ రెడ్డి పాల్గొని మాట్లా డుతు తపాల సేవలు తపాల శాఖ అందిస్తున్న వివిధ పథకా లను ఉద్దేశించి హన్మకొండ ఏఎస్ పికె హరి కృష్ణ తపాల సేవల యొక్క గొప్పతనాన్ని ప్రజలలోకి వీటి యొక్క ప్రాధా న్యతను ప్రజల జీవన ప్రమా ణాలు ఆర్థికంగా పథకాలు ఉపయోగపడు తున్నాయని ప్రమాద బీమా జీవిత బీమా పొదుపు పథ కాలు మహిళ లకు అత్యధిక వడ్డీ రేటు ఇస్తు న్న పథకం మహిళా సన్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఆడ పిల్ల లకు సంబంధించిన సుకన్య సమృద్ధి యోజన అకౌంటు, మరియు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం, కిసాన్ వికాస పత్రాలు మంత్రి ఇన్కమ్ స్కీమ్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్,టైం డిపాజిట్లు మరిన్ని పథకాలు తపాలా శాఖ వారు చేస్తున్న సేవలను వివరించారు‌.ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, పోస్ట్ ఆఫీస్ తపాలా కార్యాల యంలో ఉన్న పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్లి ప్రజలకు తెలియపరచాలని ప్రజలకు చాలామందికి ఉపయో గక రంగా ఉంటుందని,బ్యాంకులు లేనివి మారుమూల ప్రాంతా లలో ప్రాంతాలలో ఈరోజు తపాల శాఖ అనునిత్యం తపాల సేవలను అందిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ బి విజయ నాయక్,సిహెచ్ రామ్మూర్తి,ఎస్పీఎం శ్రీనివాస్, ఎంఓఆర్ రాజేంద్రప్రసాద్,కే అశోక్,చంద్రకాంత్,బీపీలు బిపిఎంలు,ఏబిపియంలు,పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Janapatla Jayaraju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *