Breaking News

సైబర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ సెటప్ ను పట్టుకోన్న పోలీసులు

18 Views

*రామగుండం పోలీస్ కమీషనరేట్

Cr.No.158/2025 U/Sec. 318(4), 319(2) BNS, Sec 66C,66D IT Act -2008 and Sec.42 (1),
42 (3) (c ), 42(3) (e) of the Tele communication Act 2023 of P.S., Jannaram.

నేరం జరిగిన స్థలం:
H.No.1-306/2 ,రాఘవేంద్ర థియేటర్ దగ్గర ,జన్నారం.

శ్రీమతి శిఖా గోయల్, ఐ.పి.యస్., డి.జి.పి., డైరెక్టర్, టి.జి.సి.యస్.బి., మరియు శ్రీ అంబర్ కిషోర్ ఝా, ఐ.పి.యస్., డి.ఐ.జి., కమిషనర్ ఆఫ్ పోలిస్, రామగుండం ఆదేశాల మేరకు ఈ రోజు జన్నారం లో టి.జి.సి.యస్.బి., డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యునికేషన్ మరియు రామగుండం పోలిస్ సంయుక్త ఆపరేషన్ నిర్వహించి సైబర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ సెటప్ ను పట్టుకోవడం జరిగింది.

నిందితుల వివరాలు.

1.యాండ్రాపు కామేష్ s/o అప్పలనాయుడు, వయస్సు: 24 సంవత్సరాలు, కులం:కొప్పల వెలమ , వృత్తి: పాలిటెక్నిక్ (మెకానిక్) ,నివాసం: పార్వతిపురం, మన్యం జిల్లా ,ఆంధ్ర ప్రదేశ్.

2.బావు బాపయ్య s/o మల్లయ్య , వయస్సు- 43 సంవత్సరాలు, కులం- గొల్ల,వృత్తి -కూలీ , నివాసం -లక్ష్మీపూర్ గ్రామం, గొల్లపెల్లి మండలం.

3.బావు మదుకర్ s/o మల్లయ్య , వయస్సు- 32 సంవత్సరాలు, కులం- గొల్ల,వృత్తి -కూలీ , నివాసం -లక్ష్మీపూర్ గ్రామం, గొల్లపెల్లి మండలం.

4.గోట్ల రాజేష్ s/o హన్మంతు వయస్సు- 40 సంవత్సరాలు, కులం- గొల్ల,వృత్తి -వ్యవసాయం , నివాసం -కిష్టాపూర్ గ్రామం , జన్నారం మండలం.

వివరాల్లోకి వెళితే :

జన్నారం వోడా ఫోన్ టవర్ పరిధిలో ని అనుమానాస్పద సిమ్ కార్డులు ఉపయోగిస్తున్నారనే సమాచారం మేరకు టి.జి.సి.యస్.బి., డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యునికేషన్ మరియు రామగుండం పోలిస్ సంయుక్త ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. జూలై 2024 నెలలో భావు బాపయ్య S/O మల్లయ్య, వయసు 43 సంవత్సరాలు, కులం: యాదవ్, R/O లక్ష్మీపూర్ (వీ) జగిత్యాల జిల్లా, కాంబోడియా దేశానికి వెళ్లాడు. అక్కడ అతను టు బ్రదర్స్ రెస్టారెంట్ లో పని చేశాడు. కాంబోడియా వెళ్ళక ముందు, 2023 లో పాలవలసల సాయి కృష్ణ @ జాక్ @ రాజు R/O వేదాంతపురం గ్రామం, అశ్వరవుపేట మండలం, కొత్తగూడెం జిల్లా ను చండీగఢ్ లో కలిశాడు. ఆ సమయంలో జాక్ కూడా ఇతర దేశాలకు వీసా కోసం ప్రయత్నిస్తున్నాడు.డిసెంబర్ 2024లో, జాక్ @ పాలవల్సుల సాయి కృష్ణ ,కంబోడియా దేశం లోని బాపయ్య పని చేయు రెస్టారెంట్ కు డిన్నర్ కు వచ్చి బాపయ్యను కలిశాడు. ఏప్రిల్ 2025లో భావు బాపయ్య తిరిగి ఇండియాకు తన ఇంటికి వచ్చాడు. ఒక రోజు జాక్ @ పాలవల్సుల సాయి కృష్ణ వాట్సాప్‌లో బాపయ్యను సంప్రదించి, జన్నారం ప్రాంతంలో ఒక అద్దె ఇల్లు ఏర్పాటు చేయమని అడుగగా అతని కోరిక పై బాపయ్య తన చెల్లెలి భర్త బొట్ల రాజేశ్ R/O కిష్టాపూర్ లు కలిసి అద్దె రూం గురించి బోడ ప్రభాకర్ R/O జన్నారం, ప్రస్తుతం కలమడుగు గ్రామం అనే వ్యక్తి ఇంటిని అద్దె కు ఏర్పాటు చేయగా, మే 2025లో జాక్ మళ్లీ వాట్సాప్‌లో బాపయ్యను సంప్రదించి, జగిత్యాల బస్ స్టాండ్ కి కొన్ని వస్తువులు ఒక వ్యక్తి ద్వారా పంపిస్తున్నానని చెప్పి, దాన్ని తీసుకుని జన్నారం లోని అద్దె గదిలో ఉంచమని ఆదేశించాడు. ఆ సమయంలో బాపయ్య అందుబాటులో లేకపోవటంతో తన తమ్ముడు భావు మధుకర్, బావ గోట్ల రాజేష్ ను ఆ పనిని చూడమని చెప్పాడు. మధుకర్ జగిత్యాల బస్ స్టాండ్ కి వెళ్ళి అట్టి వస్తువులు తీసుకొని , జన్నారం కు వచ్చిన తర్వాత, బావు పాపయ్య, గోట్ల రాజేష్ తో కలిసి జన్నారం లోని అద్దె గదిలో వాటిని అమర్చినారు. తర్వాత Airtel ఫైబర్ నెట్ కనెక్షన్ (100 mbps ప్లాన్) మూడు నెలలకి రూ.3000/- చెల్లించి తీసుకున్నారు. మళ్ళీ గోట్ల రాజేష్ అట్టి రూం నందు ఒక ఇన్వర్టర్ కొనుగోలు చేసి అమర్చినాడు మరియు బావు బాపయ్య జగిత్యాల నందు పాలవలసల సాయి కృష్ణ @ జాక్ @ రాజు ఆదేశాల మేరకు ఒక ల్యాప్ టాప్ కొనుగోలు చేసినాడు. వీటికి ఖర్చులకు గాను పాలవలసల సాయి కృష్ణ @ జాక్ @ రాజు డబ్బులను బావు బాపయ్య కు పంపడం జరిగినది. అదేవిధంగా బావు బాపయ్య, బావు మధుకర్, గెట్ల రాజేష్ కు పని చేసినందుకు గాను నెల కు రూ.౩౦,౦౦౦/- ఇస్తూ ఇట్టి మోసం ద్వారా వచ్చిన డబ్బుల్లో వాటా కూడా ఇస్తానని పాలవలసల సాయి కృష్ణ @ జాక్ @ రాజు చెప్పడం జరిగింది.

ఈ సమయం లో Telegram ద్వారా యాండ్రాపు కామేశ్ S/O అప్పలనాయుడు, వయసు 24, డిప్లొమా (పాలిటెక్నిక్ మెకానికల్), R/O పర్వతీపురం, మన్యం జిల్లా (A.P) అనే యువకుడి గురించి తెలుసుకున్నాడు. కామేశ్ Sat Sports App ద్వారా ఆన్‌లైన్ గేమ్స్ ఆడి రూ.13 లక్షలు నష్టం చూశాడు. అలాగే 2024లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చే ప్రయత్నంలో రూ.3,50,000/- నష్టం కూడా చూశాడు.ఫిబ్రవరి 2025లో కామేశ్ ఢిల్లీకి వెళ్లి Wheels I Company లో GPS/GPS Pro, డీజిల్ సెన్సార్ సేల్స్ (కీ అకౌంట్ మేనేజర్) గా మూడు నెలలు పనిచేశాడు. తరువాత స్వగ్రామానికి తిరిగి వచ్చాడు.కామేశ్ పరిస్థితిని వాడుకొని, తేదీ 30.06.2025 న జాక్ @ రాజు కామేశ్ ను వాట్సాప్ ద్వారా సంప్రదించి, నెలకు రూ.70,000/- జీతంతో జాబ్ ఇస్తానని అదేవిధంగా ఇట్టి మోసం ద్వారా వచ్చిన డబ్బుల్లో వాటా ఇస్తానని చెప్పాడు. ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల నష్టం చూసిన యాండ్రాపు కామేశ్ ఆ ఉద్యోగానికి ఒప్పుకున్నాడు. తరువాత పాలవలసల సాయి కృష్ణ @ జాక్ @ రాజు సూచనలతో కామేశ్ జగిత్యాల కు రాగా , అతనిని తీసుకొని రావడానికి బాపయ్య, మధుకర్ లు వెళ్ళి కలిసి అతనిని తీసుకొని జన్నారం లోని ఆ అద్దె గదికి తీసుకెళ్లాడు. తరువాత, బావు బాపయ్య, బావు మధుకర్, యాండ్రాపు కామేశ్ మరియు గోట్ల రాజేష్ లు కలిసి నెట్ కనెక్షన్లు ఏర్పాటు చేసి D-Link రౌటర్లు, ల్యాప్‌టాప్, సిమ్ ప్యానెల్ లాంటి పరికరాలను కలిపి ఆపరేషన్ ప్రారంభించారు. తరువాత బాపయ్య, మధుకర్ మొదటి సారి 90 ఆధారాలు లేని సిమ్ కార్డులు, రెండవ సారి 60 సిమ్ కార్డులు తెచ్చి జాక్ సూచనలతో కామేష్ కు అందించారు. తరువాత జాక్ సూచనలతో కామేశ్ సింహాద్రి R/O పర్వతీపురం, మన్యం జిల్లా ను సంప్రదించి, తన బామ్మర్ది బోను జయవర్ధన్ S/O శ్రీను, వయసు 20, కులం: కొప్పుల వెల్మ ద్వారా 200 ఆధారాలు లేని సిమ్ కార్డులు కొన్నాడు. వాటిని బాపయ్య, మధుకర్ తీసుకుని కామేశ్ కు అందించారు. వీటిని కొనేందుకు జాక్ కామేశ్ కు దాదాపు రూ.4,00,000/- లు ఇచ్చాడు. తరువాత పాలవలసల సాయి కృష్ణ @ జాక్ @ రాజు టెలిగ్రాం app ద్వారా చెప్పిన విధంగా పైన తెలిపిన నలుగురు ప్యానెల్ లో సిమ్‌లు అమర్చి, కొంత సమయం తర్వాత అవి తీయడం, కొత్త సిమ్‌లు పెట్టడం చేస్తూ ఉండేవారు తేదీ 30.07.2025న విశ్వసనీయ సమాచారం ఆధారంగా లొకల్ పోలీస్, సైబర్ క్రైమ్ సిబ్బంది, టెలికాం అధికారులు సంయుక్త సోదాలు నిర్వహించి పై నలుగురిని పట్టుకొని సైబర్ క్రైమ్ కు సంభందించిన పరికరాలు స్వాధీనం చేసుకున్నారు:

పైన తెలిపిన నిందితులు SIM Box పరికరాలు ఏర్పాటు చేసి, వివిధ రకాలైన IMEI నెంబర్లను తయారు చేసి, వివిధ రకాల లింకులను తయారు చేసి చట్ట వ్యతిరేకమైన సైబర్ నేరాలు అమాయక ప్రజలను మోసం చేయుచున్నారు. ఇట్టి విషయాన్ని టెలీ కమ్యూనికేషన్ విభాగం ( DoT) నిర్వహించినది. మరియు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ( TGCSB) బృందం, call డాటా ను విశ్లేషించి, రామగుండం పోలీస్ కమిషనరేట్, జన్నారం పోలీసుల ఆధ్వర్యంలో ఇట్టి నేరానికి పాల్పడిన ప్రదేశాన్ని గుర్తించి, పై నలుగురు నెరస్తులను మరియు నేర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

*ఇంకా ఈ కేసులో నేషనల్ మరియు ఇంటర్నేషనల్ కాల్ లింక్స్ ఉన్నందున లోతైన విచారణ చేయడం జరుగుతుంది.*

1. JIO సిమ్‌లు – 72
2. Airtel 5G Plus సిమ్‌లు – 79
3. V! prepaid 5G సిమ్‌లు – 111
4. D-Link 8 పోర్ట్‌ల – 02
5. Hero (చిన్న) ఫోన్ – 01
6. Nothing మొబైల్ – 01
7. POCO C71 మొబైల్ – 01
8. USB కేబుల్ జేబ్రానిక్స్ – 02
9. SIM Panel – 05
10. HP ల్యాప్‌టాప్ – 01
11. Airtel మోడెమ్ – 01
12. Airtel Air Fiber Box – 01
13. Inverter Excide battery + UPS
14. నీలి కేబుల్ – 03
15. పసుపు రంగు నెట్ కేబుల్ – 03
16. Frontech Cat 6 కేబుల్ (4 జంటలు
17. Internet Net కేబుల్
18. I KALL మొబైల్ ఫోన్ బాక్స్ (మాన్‌ప్యాక్ టైప్)
19. Pulsar మోటార్‌సైకిల్ స్వాధీనం.

ఇట్టి నిందితులను మరియు నేర పరికరాలను చాక చక్యంగా పట్టుకున్న
R.ప్రకాష్, ACP మంచిర్యాల.
D.వెంకట రమణ రెడ్డి, DSP సైబర్ క్రైమ్ CCPS, రామగుండము
D.రమణమూర్తి, CI of Police, లక్షేట్టిపేట, అలెన్ అనురాగ్, Asst. డైరెక్టర్ జనరల్, (Security), Dept. of టెలి కమ్యూనికేషన్స్, హైదరాబాద్ and staff, Ch. కృష్ణమూర్తి, ఇన్స్పెక్టర్, సైబర్ క్రైమ్ CCPS, రామగుండము
N. Srinivas, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్, రామగుండము
G.Anusha, SI జన్నారం,
G.Suresh SI Luxettipet,
Md. Tahsinoddin, SI దండేపల్లి and staff ను CP రామగుండము గారు, DCP మంచిర్యాల గారు అభినందించినారు.
డిప్యూటి కమిషనర్ ఆఫ్ పోలిస్
మంచిర్యాల.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *