Breaking News

దుమాల గ్రామపంచాయతీ ఎదుట ఎమ్మార్పీఎస్ దీక్ష.*

120 Views

తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 11: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లోని దూమల గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు ఖానాపురం లక్ష్మణ్ ఒక్కరోజు దీక్ష శుక్రవారం చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు రాజ్యాంగాన్ని మార్చాలని అన్నందుకు రాష్ట్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ పిలుపుమేరకు ఈ దీక్షా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందన్నారు రాజ్యాంగాన్ని అవమానపరిచిన కెసిఆర్ తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీక్షకు కూర్చున్న వారిలో కానాపురం మైసయ్య, జాలపెల్లి భూమా రాజన్ ,అందె బాబు, దుంపలపల్లి నర్సయ్య, గుర్రం భాను యాదవ్, అన్నవేని రవి యాదవ్ లు ఉన్నారు దీక్షకుమండల కాంగ్రెస్ కమిటీ సంఘీభావం దుమాల గ్రామ పంచాయతీ ఎదుట ఒక్క రోజు దీక్ష చేపట్టిన ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఖానాపురం లక్ష్మన్ కు మండల కాంగ్రెస్ కమిటీ మద్దతు తెలిపింది అంతేకాకుండా దీక్షలో కూర్చున్న నాయకులకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. సంఘీభావం తెలిపిన వారిలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి గుండాటి రామ్ రెడ్డి బానోతు రాజు నాయక్ పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7