
గిరిజనులకు ఆర్థిక చేయూత మత్స్య శాఖ ద్వారా ఉచిత చేప పిల్లల పంపిణీ
ఐటీడిఏ పెసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్
ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 15
మంగపేట మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో గల చెరు వులకు ప్రభుత్వం ద్వారా ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయడం జరిగిందనిఐటీడిఏ పెసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ అన్నారు.మూడు రకాల చేప పిల్లలు బొచ్చా రవ్వ బంగారు తీగ లాంటి 35 – 40 ఎంఎం సైజు గల చేప పిల్లలను మంచి నీటి చెరు వులలో పోయడం జరుగు తుందన్నారు.కోట్లాది సాధించు కున్న తెలంగాణ రాష్ట్రం లో గిరిజనులకు మత్స్య సంపద ద్వారా ఆర్థికంగా ప్రోత్సహి స్తుందన్నారు.మండలంలో మొదటి విడతలో భాగంగా కమలాపురం పంచాయతీలోని 2 చెరువులకు 66 వేల చేప పిల్లలు బోరు నర్సాపురం 2 చెరువులకు 28, 500 , చుంచు పల్లి 1 చెరువుకు 18, 000 చేప పిల్లలను మొత్తము 5 చెరు వులకు గాను 1 లక్ష 12 వేల 500 చేపపిల్లలని పంపిణీ చేయడం జరిగిందన్నారు. శుక్రవారంరెండో విడతలో చేరుపల్లి పంచాయతీలోని 5 చెరువులకు 1లక్ష 44 వేలు , మల్లూరు 3 చెరువులకు 94 వేల 2 వందలు పొదుమూర్ 1 చెరువుకు 18 వేలు రమన క్కపేట 10 చెఱువులకుగాను 4 లక్షల 2 వేలు ఉచిత చేప పిల్ల లను పంపిణీ చేయడం జరిగిం దన్నారు.మొత్తము 19 చెఱు వులకు గాను 6 లక్షల 58 వేల 2 వందలు ఇంకా మిగతా 42 చెరువులకు 7 లక్షల 99 వేల 5 వందల చేప పిల్లలను మండ లంలోని 66 చెఱువులకు గాను 15 లక్షల 70 వేల 2 వందలు పంపిణీ చేయబడుతుం దన్నారు.




