Breaking News

ఉద్యోగి మృతి

130 Views

గుండెపోటు తో విద్యుత్ ఉద్యోగి మృతి

ఫిబ్రవరి 16

సంగారెడ్డి జిల్లా మండలకేంద్రమైన రాయికోడ్ కు చెందిన సంగయ్య(50) కోహిర్ మండలంలో ఆర్టిజెన్ విద్యుత్ ఉద్యోగిగా విధులను నిర్వహిస్తున్నాడు, సంగయ్యకు  తన ఇంట్లో గుండెపోటు రావడం జరిగింది,ఇంట్లో ఎవ్వరు లేకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ దుర్ఘటనతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి,అందరితో కలుపుగోలుగా వుంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ఉండేవాడని,ఆయన మరణవార్త తీరని లోటు అని పలువురు విద్యుత్ అధికారులు,సిబ్బంది,బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు సంగయ్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు,అలాగే విద్యుత్ డిఈ, ఎడి, ఎఈ మరియు సిబ్బంది,కార్మికులు వచ్చి , సంగయ్య మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు.

No Slide Found In Slider.

Poll not found