*అధినేతను కలిశాకే నిర్ణయం: ఎమ్మెల్సీ కవిత.*
హైదరాబాద్:సెప్టెంబర్ 15
లిక్కర్ స్కామ్ కేసులో నెల రోజుల సుదీర్ఘ విరామం తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్,ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నోటీసుల్లో శుక్రవారం విచారణ హాజరుకావాలని పేర్కొన్నారు.
ఎన్నికలు సమీపిస్తోన్న బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే నినాదాన్ని కాంగ్రెస్ గట్టిగా ప్రస్తావిస్తున్న తరుణంలో కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా.
కాసేపట్లో కవిత ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది ఈడీ ముందుకు ఎలా వెళ్లాలి, ఏం చేయాలో కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం తండ్రి సూచన మేరకు కవిత తన తదుపరి అడుగులు వేయనుందని సమాచారం అంతేగాక ఇవాళ కవిత తరపు న్యాయవాదులు ఢిల్లీకి వెళ్లనున్నట్లు వార్తలు విస్తృతమయ్యాయి.
