ప్రాంతీయం

గంజాయి, డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యం: పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి

18 Views

రామగుండం పోలీస్ కమిషనరేట్

గంజాయి, డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యం: పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి

గంజాయి రహిత సమాజం లక్ష్యంగా అందరూ కృషి చేయాలని పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి సూచించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ, ట్రాఫిక్, సైబర్ క్రైమ్, ట్రాఫిక్ రూల్స్, తదితర అంశాల పై అవగాహనా, ప్రజలలో, యువత, విద్యార్థులలో చైతన్యం, నేరా నియంత్రణ ముందస్తూ చర్యల్లో భాగంగా రామగుండం ST కాలనీ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ, గోదావరిఖని ఏసీపీ లు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గంజాయి, మత్తు పదార్థాల వినియోగానికి విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. గంజాయి, డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యమని. ప్రధానంగా గంజాయి, డ్రగ్స్‌ వంటి మత్తు పదార్థాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అలవాటు పడకూడదన్నారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రధానంగా గంజాయి సాగు, వినియోగం, రవాణాకు పాల్పడితే తీవ్రమైన శిక్షలు అనుభవించాల్సి ఉంటుందని చెప్పారు. విద్యార్థులు, అన్ని వర్గాలకు చెందిన ప్రజలు గంజాయి, డ్రగ్స్‌ వల్ల వ్యక్తిగతంగా తమకు, సమాజానికి కలిగే నష్టాలను గుర్తించాలని, వాటిని సంపూర్ణంగా నిర్మూలించేందుకు కృషి చేయాలని డీసీపీ సూచించారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. గంజాయి, డ్రగ్స్‌ వినియోగం, రవాణాపై పోలీసులకు సమాచారం అందించాలని డీసీపీ ఈ సందర్భంగా కోరారు.

రాబోయే మున్సిపల్ ఎన్నికల సందర్భంలో ప్రజలకు పలు ముఖ్య సూచనలు, ఆదేశాలు, హెచ్చరికలను డీసీపీ జారీ చేశారు.

రోబోయే మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రజలు శాంతియుతంగా, నియమావళి ప్రకారం వ్యవహరించాలి. ఎన్నికల విధానాలను భంగం చేయగల ఏవైనా అక్రమ కార్యకలాపాలు, వ్యక్తి గత దూషణలు, హింసాత్మక చర్యలు పాల్పడకూడదని, ఏదైనా ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు.
ప్రజలు ఓటు హక్కును వినియోగించేటప్పుడు ఇతరుల హక్కులను ముప్పు లేకుండా గౌరవించాల్సిన అవసరాన్ని డీసీపీ ప్రత్యేకంగా గుర్తు చేశారు. ప్రతి ఒక్కరికి కదలికలపై పోలీసు నిఘా ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరి భద్రత, శాంతియుతంగా ఎన్నికల నిర్వహణ కీలకమని డీసీపీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏ సి పి ఎం రమేష్ రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, రామగుండం ఎస్ ఐ సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *