ప్రాంతీయం

ఉత్తమ ఉపాధ్యాయుడు నరేందర్ సేవలు అభినందనీయం : ఎంఈఓ ఉదయ్ భాస్కర్ రెడ్డి

86 Views

 

సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 11 (TS24/7 తెలుగు న్యూస్):  జగదేవపూర్ ఆదర్శ పాఠశాలలో టీజీటీ తెలుగు ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న వి నరేందర్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా నిలిచి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని అంగడి కిష్టాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలకు నరేందర్ ఆధ్వర్యంలో సోమవారం సుమారు 20 వేల రూపాయల విలువైన నాలుగు బ్రాండెడ్ ఫ్యాన్లు, 176 మంది విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్సిల్స్ అందజేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ ఉదయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నరేందర్ సేవలు అభినందనీయమని, కరోనా సమయంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఇంటింటికి వెళ్లి ఉచిత విద్యను అందించడం ప్రశంసనీయమని, అంగడి కిష్టాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తన వంతు చేయూతను అందించడం అభినందనీయమని అన్నారు అలాగే టీచర్ నరేందర్ మాట్లాడుతూ ప్రభుత్వ మరియు ఆదర్శ పాఠశాలల్లో అత్యుత్తమ మరియు నాణ్యమైన విద్య లభిస్తుందని, మంచి సౌకర్యాలు మరియు నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారని, ఉన్నత అవకాశాలు ఉన్నాయని,ప్రజలందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి సదుపాయాలన్నింటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు సర్పంచ్ దుద్దెడ లక్ష్మి రాములు గౌడ్, ఉప సర్పంచ్ కొండల్ రెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి, మాజీ చైర్మన్ కనకయ్య, పాఠశాల  ప్రధానోపాద్యాయులు ఓంకార్ రాధాకృష్ణ , ఉపాధ్యాయులు రామకృష్ణ రెడ్డి, చిన్ని కృష్ణ,  హారిక తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *