దౌల్తాబాద్, సెప్టెంబర్ 13: మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలు బుధవారం మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలుర పాఠశాలలో మండల విద్యాధికారి నర్సమ్మ, లింగరాజుపల్లి సర్పంచ్ కేత కనకరాజు లు ప్రారంభించారు. మండల స్థాయిలో అండర్ 17, అండర్ 14 కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శోభారాణి, మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్, పిడి వెంకట్ రెడ్డి, పీఈటీలు సురేష్, మోహన్, అనిత, విష్ణు, బసవరాజ్, డాంబు, తదితరులు పాల్గొన్నారు…
