Breaking News

గీత కార్మిక కుటుంబానికి ఆర్థిక సహాయం

100 Views

మర్మాముల గ్రామ నిరుపేద గీత కార్మిక సామాజిక వర్గ కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన BRS రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్

 

సెప్టెంబర్ 13

. సిద్దిపేట జిల్లా .జనగామ నియోజకవర్గం మద్దూర్ మండలం మర్మాముల గ్రామ నిరుపేద గీత కార్మిక సామాజిక వర్గానికి చెందిన ఉత్కం చంద్రమౌళి ప్రమాదవశాత్తు తాడి చెట్టు పైనుండి కింద పడి మరణించారు. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న *BRS రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్* బాధిత గృహానికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించి, కుటుంబ దీనస్థితిని చూసి చలించిపోయిన కిరణ్ కుమార్ *10,000* రూపాయల వ్యక్తిగత ఆర్థిక సహాయాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు. భవిష్యత్తులో కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.నాగపురి కిరణ్ వెంట గ్రామ శాఖ అధ్యక్షుడు కూసరాజు, వార్డ్ మెంబర్ గుండ్ల సత్యనారాయణ, బచ్చన్నపేట పిఎసిఎస్ డైరెక్టర్ వేముల లక్ష్మణ్ గౌడ్,రంగు సుభాష్ గౌడ్, గోపాల్ రెడ్డి,ఉత్కం నాగరాజు, ఉత్కం కనకయ్య,బత్తిని సిద్ధులు, పచ్చిమడ్ల నరసయ్య,చిట్కూరి ఐలయ్య, యాదగిరి, నాగపురి రవి, తాళ్లపల్లి నరేందర్,చింతల వేణు, అరవింద్, ఉదయ్ కుమార్, గుండె అజయ్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *