(కరీంనగర్ జిల్లా సెప్టెంబర్ 13)
మానకొండూర్ నియోజకవర్గ కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటుచేసిన ముదిరాజుల చైతన్య సదస్సుకు నియోజకవర్గంలోని ముదిరాజులు అధిక సంఖ్యలో హాజరై కదం తొక్కారు.ముందుగా వరంగల్ రోడ్డులో ఉన్న నీళ్ల ట్యాంకు నుంచి ముదిరాజులంతా ర్యాలీగా బయలుదేరి పల్లె స్టేజ్ మీద నుంచి తూర్పు దర్వాజ సమీపంలో ఉన్న ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ కొనసాగింది.ముదిరాజ్ సంఘం నియోజకవర్గం అధ్యక్షులు కీసరి సదానంద్ ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరైన ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు పెసరు కుమారస్వామి ముదిరాజ్,మాల కనుకయ్య ముదిరాజ్ లు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల జనాభా కలిగిన ముదిరాజులకు బిఆర్ఎస్ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వకుండా అవమానించిందన్నారు. ముదిరాజులను బీసీ డీ నుండి ఏ లో కలపాలని ముదిరాజులు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు.ముదిరాజులు చైతన్యమై హక్కులను సాధించుకోవాలన్నారు.రానున్న ఎన్నికల్లో ముదిరాజ్ లకు ప్రాధాన్యత ఇచ్చే రాజకీయ పార్టీకు మద్దతు ఇవ్వాలన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శి పప్పు సమ్మయ్య, ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు బోయిని వెంకటేష్, మహాసభ మండల ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీధర్, నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు నెల్లి శంకర్, మానకొండూర్ సొసైటీ అధ్యక్షుడు గొల్ల శ్రీనివాస్, ముదిరాజ్ నాయకులు ఎరవేణి రామాంజనేయులు, బైక రాజమౌళి, కూనశంకర్, నూనె తిరుపతి, పిట్టల మధు, నెల్లి మురళి,నెల్లి శ్రీనివాస్, ఎరవేని నాగరాజు,అనవేని రాజు,నియోజకవర్గ ఆయా మండలాల సంఘ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మత్స్య సహకార సంఘాల అధ్యక్ష కార్యదర్శులు , తదితరులు పాల్గొన్నారు.