
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మంగళవారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఆర్యవైశ్య మహిళలు శ్రావణమాస మంగళ గౌరీ వ్రతాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి కృపతో అందరూ బాగుండాలని సేవా భావం భక్తి భావం ఆర్యవైశ్యులు ఎక్కువగా ఉంటుందని సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే విధంగా పరిపాలన కొనసాగిస్తూ ఆర్యవైశ్యుల భవనం కోసం హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ లో మూడు ఎకరాల స్థలం కేటాయించడం జరిగిందని అలాగే గజ్వేల్ లో కూడా ఆర్యవైశ్య భవనం కోసం స్థలం కేటాయించడం అందరికీ తెలిసిన విషయమే అని ఆర్యవైశ్య మహాసభ మండల శాఖ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి అఖండ విజయానికి తోడ్పాటు అందిస్తామని ఏకగ్రీవ తీర్మాన పత్రం అందజేయడం సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఇటిక్యాల సర్పంచ్ సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ యువజన విభాగం అధ్యక్షులు రావికంటి చంద్రశేఖర్, నాచారం దేవస్థానం డైరెక్టర్ నాగరాజు, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మడిపడుగ చంద్రశేఖర్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కుకుటపు కొండలు, వెంకటయ్య, బుద్ధ మహేందర్,బుద్ధ చిన సత్యం ,బుద్ధ రాములు, సముద్రాల హరినాథ్,బుద్ధ సత్యపాల్ ,అమర రామ్ నివాస్, వల్లాల వెంకటేష్, జగదీష్, అయిత రాములు,ఆర్యవైశ్య నాయకులు ఆర్యవైశ్య మహిళలు చిన్నారులు బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు




