ప్రాంతీయం

సనాతన కాదు సమానత్వం కావాలి

96 Views

– డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్

దౌల్తాబాద్: సనాతన ధర్మం ముసుగులో దేశంలో తరతరాలుగా అమలుచేస్తున్నా కుల వ్యవస్థను నిర్మూలించి డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ అశించిన సమానత్వాన్ని సాధించెందుకు ఉద్యమించాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి శంకర్ పిలుపునిచ్చారు.
సామాజిక పరివర్తన పాదయాత్ర మూడవరొజు గొడుగుపల్లి,దీపాయం పల్లి,దౌల్తాబాద్, కొనాయపల్లి,గొవిందాపూర్ ల మీదుగా చేగుంట మండలం బొనాలకు వెళ్ళింది.దీపాయంపల్లి,కొనాయిపల్లి ప్రాథమిక పాఠశాల లో రాజ్యాంగ పిఠిక పై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా దౌల్తాబాద్ మండల కేంద్రము లో శివాజీ చౌరస్తాలో శంకర్ మాట్లాడుతూ సనాతన ధర్మం ముసుగులో అంటరానితనాన్ని పాటిస్తూ తొటి మనిషిని మనిషిగా గుర్తించ నిరాకరించడమే సనాతన ధర్మామా అని ప్రశ్నించారు. మణిపూర్ గిరిజన స్త్రీలపై సామూహిక అత్యాచారాలకు పాల్పడుతూ నగ్నంగా ఉరేగించాలని ఏ ధర్మం చెప్పిందని అన్నారు. ఈ మరణకాండను అపాడానికి కేంద్ర బిజెపి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకొలేదన్నారు.కుల మత విద్వేషాలనుండి దేశాన్ని కాపాడుకొవాలన్నారు. భారత రాజ్యాంగంలో ఇండియా అంటే భారత్ అని రాసుకున్నప్పటికి ఇండియా పేరును తొలగింపు వెనుక వున్న కుట్రను ఎండగట్టాలన్నారు..ప్రపంచము శాస్త్ర సాంకేతిక రంగాలలో దూసుకపొతుంటే భారతదేశాన్ని మూఢనమ్నకాల వైపు తీసుకెళ్ళుతున్నారని దుయ్యబట్టారు.పాదయాత్ర గా వస్తున్న బేగంపేట,వడ్డెపల్లి,రామరాం,మందాపూర్,గొడుగుపల్లి గ్రామాలలో కుల వివక్ష పాటిస్తూ దళితులను దేవాలయాల్లొకి రానివ్వకుండా అంటరానితనాన్ని కొనసాగించడం సిగ్గు చేటన్నారు. అంటరానితనం నిర్మూలనకు ప్రభుత్వం చర్యలు తీసుకొవాలని ప్రతినెల పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు.ఈ పాదయాత్ర లో డాక్టర్ కుమార్,సురేందర్ సింగ్ డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి, డిబిఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షుడు దుబాసి సంజీవ్,డిబిఎఫ్ సిద్దిపేట జిల్లా ప్రదాన కార్యదర్శి బ్యాగరి వేణు,బందాఎం స్వామి,యంఅర్ పిఎస్ నాయకులు గువ్వలేగి సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *