ప్రాంతీయం

మధ్యాహ్న భోజన కార్మికులసమ్మె ఎంఈఓకు వినతిపత్రం అందజేసిన…

96 Views

ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్11, మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వంట చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు మాసమస్యలను పరిష్కరించాలని ఈనెల13వ తేదీనుండి సమ్మె చేపడుతున్నామని మండల విద్యాధికారికి వినతి పత్రం అందించారు. ఈసందర్భంగా మధ్యాహ్న భోజనం కార్మిక జిల్లా అధ్యక్షురాలు గొట్టే సంతోష మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న బిల్లులను అసెంబ్లీ సాక్షిగా సీఎం నెలకు 2000 వేతనం పెంచారు. కానీ పెంచిన జీతం ఇప్పటివరకు అమలు కాలేదు. జీతంకూడా ఏడునెలల నుండి పెండింగ్లో ఉన్నదని మిస్ బిల్లులు ఆరు నెలల నుండి రాలేదని 9,10 తరగతిలో బిల్లులు ఎగ్గు బిల్లులు15.నెలల నుండి రావడంలేదని మొత్తం వచ్చేదాకా మధ్యాహ్న భోజనం నిలుపుదల కొరకు 13.వ తేదీ బుధవారం నుండి సమ్మె ప్రారంభిస్తామని మండల విద్యాధికారి అసిస్టెంట్ శ్రీకాంత్ రెడ్డికి వినతిపత్రం మధ్యాహ్నభోజన కార్మికులు అందించారు. ఈకార్యక్రమంలో మధ్యాహ్న భోజనం అధ్యక్షరాలు గొట్టే సంతోష, పర్సలక్ష్మి, బైరిగోని నరసవ్వ, దేవలక్ష్మి, రేణుక, భారతి, వెంకటనరసవ్వ, దేవవ్వ, విజయ, భాగ్య, సత్యవతి, మధ్యాహ్నభోజన కార్మికులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *