ప్రాంతీయం

వాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

31 Views

వాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

చందంపేట, ఫిబ్రవరి 28

చందంపేట: వాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి.చందంపేట మండలం నక్కలగండి తండా సమీపంలోని డిండి వాగులో పడి అన్నదమ్ములు హరి ప్రసాద్(8), బిట్టు(6) మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం వాగు సమీపంలో ఉన్న అన్న వద్దకు వెళ్తున్న చిన్నారులు, నీటిలోతు తెలియక వాగులోకి దిగి నీట మునిగి మృత్యువాత పడ్డారు. చిన్నారులు ఇంటి వద్ద లేకపోవడం, వాగు ఒడ్డున బట్టలు ఉండడంతో కుటుంబ సభ్యులు వాగులో వెతకగా చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. చిన్నారుల మృతితో తండాలో విషాదచాయలు అలుముకున్నాయి.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్