ప్రాంతీయం

*బాలల హక్కుల వారోత్సవాలపై పోస్టర్ రిలీజ్ చేసిన గౌరవ ఎమ్మెల్యే*

118 Views

మహిళలు, పిల్లలు,వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ రాజన్న సిరిసిల్ల తరపున బాల బాల రక్షా భవన్ ద్వారా బాలల హక్కుల దినోత్సవం నవంబర్ 20 తేదీని పురస్కరించుకొని బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి మరియు జడ్పిటిసిల చేతుల మీదుగా బాలల హక్కుల వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించడం జరిగినది.
బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమం గీతా నగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో ముఖ్య అతిథి గా జిల్లా సంక్షేమ అధికారి పి. లక్ష్మిరాజం విచ్చేసి బాలల హక్కుల గురించి వివరించి అత్యవసర సమయాలలో 10 9 8 నెంబర్ కి కాల్ చేయవలసిందిగా తెలియజేస్తూ మరియు రక్షణ సంరక్షణ కొరకై బాల రక్ష భవన్ లోని ఏడు విభాగాలు సేవలను వినియోగించుకోవాలని బాలలకు తెలపడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి భాగ్య రేఖ , బాల రక్ష భవన్ కోఆర్డినేటర్ శ్రీమతి సుచరిత , పాఠశాల ఉపాధ్యాయులు, బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ త్రివేణి మరియు సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7