ప్రాంతీయం

ఓటరు గా నమోదు చేసుకోవాలి

69 Views

దౌల్తాబాద్: 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని తహసిల్దార్ సుజాత అన్నారు. సోమవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాల, మహాత్మ జ్యోతిబాపూలే బాలుర, బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఓటు హక్కు వినియోగం, ఓటరు జాబితాలో పేరు నమోదు పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్విఎస్పి, ఓటరు హెల్ప్ లైన్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అర్హులైన ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నర్సవ్వ, ప్రిన్సిపల్ లు శోభారాణి, సురేష్ రెడ్డి, సురేఖ, జ్యోతి, అర్ ఐ మధుసూదన్, తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *