జయమ్మ కు రాష్ట్ర ఆదర్శ మహిళ అవార్డు రావడంతో జయంమను శాలువాతో అభినందించారు
గజ్వేల్, మార్చి 12
జగదేవపూర్ ముదిరాజ్ సంఘం మండల మహిళా అధ్యక్షురాలు కొన్నే జయమ్మ ముదిరాజ్ ని, రాష్ట్ర ఆదర్శ మహిళ అవార్డు వచ్చిన సందర్భంగా బీసీ సెల్ మర్కుక్ మండల అధ్యక్షులు ముదిరాజ్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మేకల కనకయ్య, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు రాగుల రాజు ముదిరాజ్, మండల ఉపాధ్యక్షుడు రొయ్యల కర్ణాకర్ ముదిరాజ్, మండల యూత్ ప్రధాన కార్యదర్శి తిగుళ్ల బాలకిషన్ ముదిరాజ్, ప్రభాకర్ వెంకటేశులు పాల్గొన్నారు.
