ముస్తాబాద్, మార్చి 20 (24/7న్యూస్ ప్రతినిధి): జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాలలో ఇటీవల వడగళ్లతో నష్టపోయిన రైతుల పొలాలను సందర్శించి వారికి భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. ఇదే తరుణంలో గత కొంతకాలంగా కమలానికి దూరంగా ఉన్న కోల కృష్ణగౌడ్ బిజెపి పార్టీలో చేరారు గతంలో పార్టీ కోసం కొన్నేళ్లుగా నిస్వార్ధంగా సేవకుడిగా పనిచేసిన ప్రధాన కార్యదర్శి కోలా కృష్ణగౌడ్ ను నేడు తిరిగి బిజెపి కుటుంబంలోకి బండి సంజయ్ సాధారణంగా ఆహ్వానించి పార్టీ కాండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గం అభ్యర్థి రాణీరుద్రమ, జిల్లాప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, మండల అధ్యక్షులు మేరుగు అంజాగౌడ్, కిసాన్ మోర్చ అధ్యక్షులు వరి వెంకటేష్ తో పాటు పలువురు మండల బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




