ప్రాంతీయం

అర్హులైన వారు మత్స్య సహకార సంఘాల్లో నమోదు చేసుకోవాలి

128 Views

అర్హులైన వారు మత్స్య సహకార సంఘాల్లో నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలో రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ నేతృత్యంలో జిల్లా వ్యాప్తంగా ఫస్ట్ పేజ్ లో 43 మత్స్య సహకార సంఘాలలో 973 కొత్త సభ్యులు నమోదు చేయడం జరిగింది. అలాగే రెండవ పేజ్ లో 48 మత్స్య సహకార సంఘాలలో కొత్తగా సభ్యుల నమోదు చేయడం జరుగుతుంది. కావున ఫిబ్రవరి 1వ తేదీ నుండి 16వరకు జిల్లా వ్యాప్తంగా షెడ్యూల్ ప్రకారం ఆయా గ్రామాలలో మత్స్యకార సొసైటీలలో చేరడానికి నైపుణ్య పరీక్ష నిర్వహించి రెండో పేజ్ లో 1529 మందిని ఎంపిక చేయడం జరుగుతుంది. ఎక్కువ మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు మత్స్యశాఖ, అధికారులు మత్స్యకారులు అధిక సంఖ్యలో నైపుణ్య పరీక్షలో పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *