ముస్తాబాద్ ప్రతినిధి జూలై 6, కొండాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6.5 లక్షల సిఎస్ ఆర్ నిధులతో మౌలిక వసతుల కొరకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ జనగామ శరత్రావు మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలకు దీటుగా అంగులతో తీర్చిదిద్దాలని గొప్ప లక్ష్యంతో సిఎస్ ఆర్ నిధులను వెచ్చించి ప్రతి పాఠశాలలో మౌలికవసతులు అదనపు తరగతి గదులు ఆన్లైన్ తరగతి గదులు కంప్యూటర్ ల్యాబ్లులు సైన్స్ ల్యాబ్ ఇలా విద్యార్థులకు అనుగుణంగా మెరుగైన విద్యను అందించుట కొరకు అన్ని రకాలుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడం జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రంటి లక్ష్మి, జెడ్పిటిసి గుండం నరసయ్య, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపెల్లి సురేందర్ రావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.




