సీఎం రేవంత్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
తెలంగాణ, డిసెంబర్ 20, తెలుగు న్యూస్ 24/7
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం మాట్లాడుతూ.. పసలేని, తెలివి తక్కువ వాళ్ళు బీఆర్ఎస్‌తో బీజేపీకి పొత్తు ఉందని మాట్లాడుతారని మండిపడ్డారు. ఎవరితో బీజేపీ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై అడిగితే తప్పేంటి ప్రశ్నించారు. గతంలో సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిపై కూడా అడిగారని గుర్తుచేశారు. పసలేని వాళ్లు తమ మీద ఆరోపణలు చేస్తే జవాబు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.రాజకీయ విమర్శలు మాని ప్రజలకు మేలు చేసే పనులు చేయాలని హితవుపలికారు. ఆదాయం వ్యక్తిగత అవసరాల కోసం జీహెచ్ఎంసీలో మునిసిపాలిటీలు , కార్పొరేషన్ల విలీనం చేశారని.. దీనిపై మొదటి నుంచి బీజేపీ అభ్యంతరం చెబుతోందన్నారు. గ్రామాల్లో గెలిచిన సర్పంచ్‌లను డబ్బు ఆశ , ఇతర అంశాలను సాకుగా చూపి కాంగ్రెస్‌లోకి రావాలని కోరుతున్నారని మండిపడ్డారు.గ్రామ పంచాయితీలకు రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏం ఉండదన్నారు. గ్రామంలోని ప్రతి అభివృద్ధికి కేంద్ర నిధులే ప్రధానమని స్పష్టం చేశారు. బీజేపీలో గెలిచిన సర్పంచ్‌లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల మీద అవగాహన ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.





