ప్రాంతీయం

వరిధాన్యం కొనుగోలు ప్రారంభించాలి. లేనిప…

279 Views
 ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్31, వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని రైతులతో కలిసి బిజెపి జిల్లా కార్యాలయ సహాయ కార్యదర్శి బాధ నరేష్ అన్నారు. బాధ నరేష్ మాట్లాడుతూ అప్పుల బాధతో దళారీ వ్యవస్థ దాటికి తట్టుకోలేక కోసిన పంట కోసినట్టు రైస్ మిల్లులకు సరఫరా చేస్తున్నారు. తక్కువ ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. బిడ్డల భవిష్యత్తు కోసం, సమాజంలో ఉన్నతి కోసం భూమినే నమ్ముకున్న రైతు ఆ భూమిని అమ్ముకుంటున్నాడు. ఫలితంగా సారవంతమైన వేల ఎకరాలు బీడు భూములుగా మారిపోతున్నాయి. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం, రైతు సంక్షేమ ప్రభుత్వం మాది, రైతు వద్దకే అన్ని సేవలు అందిస్తామన్న ప్రభుత్వాలు వెంటనే వారిచ్చిన హామీలను ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతులు పండించిన వరి ధాన్యానికి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుకుంటున్నారు. లేనిపక్షంలో రైతుల పక్షాన పోరాటం చేయడానికి వెనకాడమని బాద నరేష్ పేర్కొన్నారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *