ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్11, గ్రామానికి చెందిన చేను పూసల మహేష్ అనేవ్యక్తి తనఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు పెంచుతున్నాడని పక్క సమాచారం మేరకు తనఇంటి వద్ద తనిఖీ చేయగా ఒక గంజాయి మొక్క తనఇంటి ఆవరణలో అధికారులు గుర్తించారు. ఇట్టి సమాచారాన్ని వెంటనే అధికారులు తహసిల్దార్ ముస్తాబాద్ కు తెలియపరచగా సంఘటన స్థలానికి తహసిల్దార్ గణేష్ పంచనామ నిర్వహించి అట్టి గంజాయి మొక్కను స్వాధీనపరచుకోగా, ఇట్టి గంజాయి మొక్కను పెంచిన పూసల మహేష్ పై ఎస్సై శేఖర్ రెడ్డి కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు
సమాచారం.




