ప్రాంతీయం

కేంద్ర ప్రభుత్వం బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి పక్షాన వినతి

20 Views

మంచిర్యాల జిల్లా.

ఎ ఓ రాజేశ్వర్ కు కేంద్ర ప్రభుత్వం బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి పక్షాన వినతి
*డిమాండ్స్*
1) కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి
2) రెండు లక్షల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి
3) ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం లాగే బీసీల సామాజిక రక్షణ భద్రతకై బీసీ యక్ట్ ఏర్పాటు చేయాలి
4) 50 శాతం సీలింగ్ రిజర్వేషన్ ఎత్తివేయాలి
5) ఈ డబ్యోఎస్  రిజర్వేషన్లు రద్దు చేయాలి
6) బీసీ ఉద్యోగులకు పదోన్నతులలో రిజర్వేషన్లు అమలు చేయాలి
7) బీసీల్లో రోస్టర్ విధానాన్ని అమలు చేసి ఎస్సీ, ఎస్టీ లాగే బ్యాక్లాగ్ పోస్టులు బీసీ వర్గాలకు వర్తింపచేయాలి
8) అత్యాచార నిరోధక చట్టాన్ని బీసీలకు సైతం వర్తింపచేయాలి
9) జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికను అమలు చేయాలి
10) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
11) కాంట్రాక్టు పారిశ్రామిక రంగాలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
12) బిపి మండల్ కమిషన్ సిఫార్సు అమలు చేయాలి

ఇట్టి మా న్యాయమైన డిమాండ్లను కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం లేనిపక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాము.

ఈ కార్యక్రమంలో బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు గజ్జెల్లి వెంకటయ్య, శాఖ పూరి భీమ్సేన్, వేముల అశోక్,చంద్రగిరి చంద్రమౌళి, అంకం సతీష్, కొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *