గుండెపోటుతో వ్యక్తి దేవయ్య మృతి
ప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట :
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఆటో కార్మికుడు కోనేటి దేవయ్య50అనే వ్యక్తి గుండెపోటుతో శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు.అటో కార్మికుడు దేవయ్య తన ట్రాలీ ఆటోలో కొండాపురము గ్రామానికి సిమెంట్ బ్యాగులు తీసుకుని వెళ్లి కాళీ ట్రాలీతో తిరిగి ఎల్లారెడ్డిపేటకు వస్తుండగా గుండెపోటు రావడంతో ఆయనను వెంటనే తోటి కార్మికులు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.ఆయనను పరీక్షించిన డాక్టర్ మరించినట్లు తెలిపారు. మృతునికి భార్య లక్ష్మి కుమారుడు సాయి, కుమార్తె స్రవంతి లు ఉన్నారు.అతని మృతదేహాన్ని చూసి అతని కుటుంబ సభ్యులు బంధుమిత్రులు గ్రామస్తులు బోరున విలపించారు. దీంతో గ్రామంలో విషాదము చోటుచేసుకుంది.
