ప్రాంతీయం

సర్పంచ్ పదవికోసం స్పీడ్ పెంచిన అభ్యర్థులు…

15 Views

ముస్తాబాద్, డిసెంబర్ 12 (24/7న్యూస్ ప్రతినిధి) మండల కేంద్రంలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏటా చర్చనీయాంశంగా మారాయి. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాభివృద్ధిలో భాగంగా సర్పంచ్ పదవి కోసం అభ్యర్థులు చలితీవ్రతను లెక్కచేయకుండా ముందుకు దూసుకెళ్తున్నారు. మండల కేంద్రంలో 10 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉండగా ఇందులో మూడు పార్టీలతో పాటు మరొకరు ఇండిపెండెంట్ గా ప్రచారం స్పీడ్ పెంచారు. మిగతా 6.మంది అభ్యర్థులు సాధారణంగా ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. కాగా మండలంలోని ఓటర్ల సంఖ్య 7347 ఉండగా ఇందులో 3722 పురుషులకంటే మహిళలే అధికం, పురుషులు మాత్రం 3625 ఉన్నవి. కాగా ముస్తాబాద్ లో మొత్తం 14 వార్డులు ఇక వార్డు మెంబర్లలో పోటీ చేసిన వారి సంఖ్య మొత్తం 58 ఉండగా1వ. వార్డులో ముగ్గురు, 2వ. వార్డులో ముగ్గురు 3వ.వార్డులో నలుగురు 4వ.వార్డులో ఐదుగురు 5వ.వార్డులో ముగ్గురు 6వ.వార్డులో ముగ్గులు 7వ.వార్డులో ముగ్గురు 8వ,వార్డులో ఇద్దరు 9వ వార్డులో ఇద్దరు 10వ. వార్డులో ఎనమిది, 11వ.వార్డులో నలుగురు, 12వ.వార్డులో ముగ్గురు, 13వ. వార్డులో ఐదుగురు, 14వ వార్డులో ఏడుగురు ఉన్నారు, ఇకపోతే వార్డుల్లో ఓటర్ల సంఖ్య 1వ. వార్డులో 512, 2వ.వార్డులో 519, 3వ.వార్డులో 535, 4వ.వార్డులో 513, 5వ.వార్డులో 533, 6వ.వార్డులో 530, 7వ. వార్డులో 530, 8వ.వార్డులో 525, 9వ.వార్డులో 512, 10వ.వార్డులో 533, 11వ.వార్డులో 523, 12వ. వార్డులో 520,13వ.వార్డులో 527, 14వ.వార్డులో 535 ఉన్నాయి. ఏదేమైనా ముస్తాబాద్ సర్పంచ్ ఎన్నికల ప్రచారం తగ్గేదేలే అన్నట్లుగా సాగుతుంది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *