సమ్మె విచ్ఛిన్నంకై ప్రభుత్వ బెదిరింపు చర్యలు మానుకోవాలి
సిఐటియూ డిమాండ్
ములుగు జిల్లా,ఏటూరునాగారం,సెప్టెంబర్ 11
అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయాలని,ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, గ్రాట్యూటి అమలు చేయాలని,రిటైర్మెంట్ బెన్ఫిట్స్ టీచర్లకు 10 లక్షలు,అయాలకు 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏటూరునాగారం ఐ సి డి ఎస్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మె ను సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎండి దావుద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దావుద్ మాట్లాడుతూ అంగన్వాడీల చట్టబద్ధమైన సమ్మెకు ప్రభుత్వం ఆటంకాలు కల్పించడం,అక్రమ అరెస్టులు చేయటం తాడువాయి అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలగొట్టి సెంటర్ ఓపెన్ చేయడం లాంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడ్డారని,తాడువాయి పోలీస్ స్టేషన్లో సుమారు 40 మంది అంగన్వాడి టీచర్లు ఆయాలను అక్రమ అరెస్టు చేశారని ఇది అప్రాజస్వామికమని అన్నారు. ప్రభుత్వ నిరంకుశ, నిర్భంద చర్యలు మానుకోవాలని లేకపోతే తీవ్రమైన పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. అంగన్వాడీ టీచర్లు శిశు పోషణ, బాలింత సంరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులకు విద్యాబోధన చేస్తూన్నారు. బి ఎల్ ఓ డ్యూటీలు చేస్తూ, ఆన్లైన్ యాప్ సర్వేలు,బి ఎల్ ఓ మీటింగులు పనికి సంబంధం లేని పనులు చెబుతూ ప్రభుత్వం వీరి చేత గొడ్డు చాకిరి చేయించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు.వారికి పని భారం తగ్గించాలని, అన్ని సర్వేల యాపులు తొలగించి ఒకే యాప్ ఆన్లైన్ సర్వే వుండాలని వారికి ఇ ఎస్ ఐ,పి ఎఫ్, గ్రాట్యూటి,ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కే సరోజన, కే సమ్మక్క, రుద్రమదేవి, జమున, సరిత,లలిత, జయలక్ష్మి, వెంకటేశ్వరి, సూరమ్మ, అరుణ,ఇందిర మార నాగలక్ష్మి ,పాటు 80 మంది తదితరులు పాల్గొన్నారు.