వేములగట్, లింగరాజ్ పల్లి గ్రామ భవన నిర్మాణ కార్మిక నూతన కార్యవర్గం ఎన్నిక
అధ్యక్షునిగా జంగిటి మల్లేశం
గజ్వేల్ డిసెంబర్ 19, ( తెలుగు న్యూస్ 24/7 )
గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఆర్ అండ్ ఆర్ కాలనీలో శుక్రవారం వేములఘాట్, లింగరాజ్పేట్ గ్రామంలో భవన నిర్మాణ కార్మిక సభ్యుల సమక్షంలో గ్రామ భవన నిర్మాణ కార్మిక నూతన కార్యవర్గం ఎన్నిక. అధ్యక్షునిగా జంగిటి మల్లేశం, ఉపాధ్యక్షులుగా ప్యాట బాబు,కోశాధికారి ఉప్పరి యాదగిరి .,ప్రధాన కార్యదర్శి దాతరపల్లి నరసింహులు క్యాషియర్. సుతారి శ్రీనివాస్ ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు జంగింటి మల్లేశం మరియు ఉపాధ్యక్షులు ప్యాట బాబు మాట్లాడుతూ నా తోటి కార్మిక సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, భవన నిర్మాణ కార్మికుల సమస్యల పట్ల ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, భవన నిర్మాణ కార్మికుల సంఘ భవనం కోసం ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సలహాదారుడు చింతల బాబు, ఎండి సురాజ్, సుతారి కనక సేన, ఉప్పరి బాలయ్య, పానుగంటి స్వామి, నిజామాబాద్ రామకృష్ణారెడ్డి,కార్యవర్గ సభ్యులు కుమ్మరి స్వామి, నాగని నాగయ్య, డప్పు కిష్టయ్య, సుతారి రాజయ్య, లక్ష్మాపురం కనకయ్య, సుతారి సత్తయ్య, కర్రోళ్ల సత్తయ్య, యర్రగొల్ల యాదగిరి, వేముల కిష్టయ్య, సుతారి మల్లేశం, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.





