
ములుగు జిల్లా,మంగపేట మండలం, సెప్టెంబర్ 10
మంగపేట మండలం వాగొ డ్డుగూడెం పంచాయతీ పరిధిలోగల లక్ష్మీ నరసాపురం గ్రామంలో వెలసిన శ్రీ నాగు లమ్మ అమ్మవారికి ఆదివాసి పూజారులు సామ కొత్తల పండుగను ఘనంగా నిర్వ హించారు.ఈ కార్యక్ర మాన్ని ప్రతి ఏటా పుబ్బా కార్తె లో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ నాగులమ్మ అమ్మ వారికి ఆదివాసీ పూజారులు వడ్డేలు గోదావరి జలాలతో అమ్మవారికి సంబంధించిన గజ్జెలను మువ్వలను జెండా లను అడారాలను శుద్ధిచేసి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు.అనంతరం కొత్తగా పండిన లేదా పొట్ట దశలో ఉన్న చిరుధాన్యాలకు సంబంధించిన కొర్రలు సామలు జొన్నలు కంకవడ్లు బెల్లం కలిపి పాయసం తయారు చేసి ప్రధా న పూజారి బాడిశ రామకృష్ణ స్వామి ఇంటి నుండి డోలి వాయిద్యాలు నడుము తీసు కువచ్చి శ్రీ నాగులమ్మ అమ్మవారికి సమర్పిస్తారు. అదేవిధంగా పొట్ట దశలో ఉన్న చిరుధాన్యాలకు సంబంధించిన మండలతో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న నాగులమ్మ అమ్మవారికి సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గడికమారాజు ఎర్రమ్మ మారెమ్మలకు ప్రత్యేక పూజలు చేసి గద్దెల మీద ఉన్న స్తంభాలకు యెన్ను కడతారు ఈ కార్యక్రమంలో ప్రధాన పూజారి బాడిశ నాగ రమేష్, పూజారులు సోడి సత్యం, కుర్సం పుల్లయ్య,మడకం రమేష్,వడ్డెలు మడకం రాజేశ్వరరావు,మడకం లక్ష్మయ్య,ఈసం సమ్మక్క,కట్టం సమ్మక్క,కట్టం నాగరాజు,కారం రాజేష్,పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.కుల పెద్దలు విష్ణు మూర్తి బొగ్గుల కృష్ణమూర్తి, బాడిశ శ్రవణ్ కొర్స సమ్మక్క మహిళలు పెద్ద సంఖ్యలో ఆదివాసీలు భక్తులు పాల్గొని అమ్మవారికి పూజలు జరిపారు.




