(మానకొండూర్ సెప్టెంబర్ 26)
మానకొండూర్ మండలం కేంద్రంలోని వినాయక మండపం వద్ద సర్పంచ్ రోడ్డ పృథ్వీరాజ్ ఏర్పాటు చేసిన వినాయక మండపం లో మంగళ వారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సుడా చైర్మన్ జివి రామకృష్ణారావు హాజరై గణపతి పూజలో పాల్గొని పృధ్వీ రాజ్ కుటుంబ సభ్యులతో కలసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.. వీరితోపాటు జడ్పిటిసి తాళ్లపల్లి శేఖర్ గౌడ్, ముంజంపల్లి గ్రామ సర్పంచ్ రామంచ గోపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ నెల్లిమురళి, స్థానిక సీఐ రాజ్ కుమార్, నాయకులు దండు రాములు, పిట్టల మధు, ఉండింటి శాంసన్ ,శాతరాజు యాదగిరి, పిండి సందీప్, సత్యనారాయణ, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.